తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్సంస్థ ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లో ఒరిజినల్ డే పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. టాలీవుడ్ సెలబ్రిటీలు , తెలుగు ప్రభావశీలురు ఈ కార్యక్రమంలో హాజరయ్యారు . ఇందులో పాల్గొని చిట్ చాట్ చేసిన విజయ్ దేవరకొండ- చిరంజీవి న‌డుమ సంభాష‌ణ ఉత్కంఠ క‌లిగించింది. కుటుంబ విలువల నుండి వారి కెరీర్ వరకు ప్రతిదాని గురించి ఈ వేదికపై చర్చించారు. వీరిద్దరి సంభాషణలోని ఛ‌మ‌క్కులు ఇప్పుడు అభిమానుల్లో చ‌ర్చ‌గా మారాయి. మెగాస్టార్ గా చిరంజీవి, యువ‌హీరోగా దేవ‌ర‌కొండ చాలా ఎత్తుకు ఎదిగినా కానీ వారి లోపల మిడిల్ క్లాస్ ఎక్క‌డికీ పోలేద‌ని ఇద్దరూ ఒప్పుకోవటం విశేషం. తన జీవితం చాలా మారిపోయిందని, కానీ తన మ‌న‌సు ప్ర‌కారం నేను ఎప్ప‌టికీ మిడిల్ క్లాస్ అబ్బాయినే అని విజయ్ చెప్పాడు, షాంపూ బాటిల్ దాదాపు ఖాళీగా అయినప్పుడు నీళ్ళు నింపి వాడుకునే అలవాటు తనకు ఇప్పటికీ ఉందన్నారు .. అందుకే తన వ‌స్తువును విసిరేసే ముందే దానిని చాలా సద్వినియోగం చేసుకుంటాననివిజయ్ దేవరకొండ చెప్పారు. ఇక మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ మిడిల్ క్లాస్ మెంటాలిటీ గురించి తాను ఎదుర్కొన్న అవ‌మానాల గురించి చిట్ చాట్ లో వెల్ల‌డించారు.. తాను కూడా సబ్బుతో అదేవిధంగా చేస్తానని పేర్కొన్నాడు. తాను చిన్న సబ్బు ముక్కలను పారేసే బదులు వాట‌న్నిటినీ క‌లిపి మరో వారం పాటు వాడతానన్నారు . తన కుటుంబం అలవాటుగా విద్యుత్తును వృథా చేస్తుందని , తాను లైట్లు ఆఫ్ చేస్తూ తిరుగుతానన్నారు . రామ్ చరణ్ రీసెంట్‌గా బ్యాంకాక్‌కి వెళుతూ లైట్‌లు ఆఫ్‌ చేయకుండా వెళితే తాను ఆఫ్ చేశానని గుర్తు చేశారు. అలాగే తాను నీటి సంరక్షణ విష‌యంలో కూడా ప్రత్యేకంగా ఆలోచిస్తానని, ప్ర‌తి ఒక్క‌రూ త‌మ ఇంట్లో ఇంకుడు కుంత‌లు త‌వ్వించాలని ` చిరు చెప్పారు . అంతేకాదు ఇలాంటివి రాసేప్పుడు వ్యంగ్యంగానో వెట‌కారంగానో కాకుండా మీమ్స్ లాగా స‌ర్కాస్టిక్ గా రాయాల‌ని చిరంజీవి మీడియానుద్దేశించి కోరారు. ఇదే ఇంట‌ర్వ్యూలో తన కుటుంబాన్ని ఎలా చూసుకోవాలో మా నాన్న నుండి నేర్చుకున్నానని చిరంజీవి అన్నారు. ఇక మా అమ్మ నుండి కుటుంబాన్నే కాకుండా ఎదుటివారిని ప్రేమగా చూసుకోవడం నేర్చుకున్నానని చిరు తెలిపారు.