తెలంగాణ శాసన సభ సమావేశాలు ఆగస్ట్ 3వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు తెలంగాణ శాసన సభ, శాసనమండలి సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. వచ్చే నెల మొదటి వారంలో సమావేశాలు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 12తో ముగిశాయి. ఆరు నెలల గడువు ప్రకారం ఆగస్ట్ 11లోపు తిరిగి అసెంబ్లీ సమావేశం కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆగస్ట్ మొదటి వారంలో అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశం కానుంది. ఎన్నికలకు ముందు ఇవే చివరి అసెంబ్లీ సమావేశాలు అయ్యే అవకాశముంది.