మహబూబ్‌నగర్: గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేసే సత్తా కాంగ్రెస్‌కు లేదని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌‌రెడ్డి అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ వచ్చే ఎన్నికల తర్వాత మరింత బలహీనపడే అవకాశం ఉందన్నారు. తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం బాటలోనే కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోందని ఎద్దేవా చేశారు. శుక్రవారం నాడు బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మరోసారి దేశానికి ఎవరు ప్రధాని కావాలోప్రజలు నిర్ణయం తీసుకున్నారని.. అందుకు మోదీనే సరైన నాయకుడిగా గుర్తించారని తెలిపారు. కర్ణాటకలో 90 శాతం ఎంపీ స్థానాలు బీజేపీ గెలుస్తోందని తెలిపారు. హైదరాబాద్‌లో రియాల్టర్లు, బిల్డర్లను, వ్యాపారులను సీఎం రేవంత్‌రెడ్డి రాహుల్ గాంధీ ట్యాక్స్ కోసం వేధిస్తున్నారని ధ్వజమెత్తారు..