మహిళలను ఈడీ కార్యాలయానికి పిలిపించి విచారించడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ సంజయ్ కిషన్ కౌర్ ధర్మాసనం… దానిపై విచారణ జరపాలని నిర్ణయించింది. కవిత దాఖలు చేసిన పిటిషన్ పై ఆరు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఈడీని ఆదేశించింది. ఆ తర్వాత రెండు వారాల్లో రిజాయిండర్ దాఖలు చేయాలని కవితకు సూచించింది.మహిళలను దర్యాఫ్తు సంస్థల ఆఫీసుల్లో ఎలా విచారిస్తారని కవిత పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై కవిత తరఫున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబాల్, ముకుల్ రోహిత్గీ వాదనలు వినిపించారు. విచారణకు తెలంగాణ ప్రభుత్వం తరఫున అదనపు అడ్వోకేట్ జనరల్ జే రామచంద్ర రావు హాజరయ్యారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో కవితను దర్యాఫ్తు సంస్థలు విచారించిన విషయం తెలిసిందే.

Previous article‘బ్రో’ – మూవీ రివ్యూ
Next articleపూజా హెగ్డే ఆత్మహత్యాయత్నం చేసిందన్న సినీ విమర్శకుడు… లీగల్ నోటీసులు జారీ