తనను తాను ఓవర్సీస్ సెన్సార్ బోర్డు సభ్యుడిగా చెప్పుకునే ఉమైర్ సంధూ… కొత్త సినిమాలపై రివ్యూలు, సినీ తారల గురించి బ్రేకింగ్ న్యూస్ ఇస్తూ వివాదాస్పదమైన వ్యక్తిగా గుర్తింపు పొందాడు. ఇటీవల ఉమైర్ సంధూ అందాలభామ పూజా హెగ్డే ఆత్మహత్యాయత్నం చేసిందంటూ సంచలనం సృష్టించాడు. అయితే, ఆమెను కుటుంబ సభ్యులు కాపాడారని తెలిపాడు. పూజా హెగ్డే గత రెండు వారాలుగా డిప్రెషన్ లో ఉన్నట్టు ఆమె సోదరుడు చెప్పాడని ఉమైర్ సంధూ వెల్లడించాడు. అయితే, సంధూ వ్యాఖ్యలను తీవ్రంగా తీసుకున్న పూజా హెగ్డే టీమ్ అతడికి లీగల్ నోటీసులు పంపింది. తనకు పూజా హెగ్డే నుంచి లీగల్ నోటీసులు అందిన విషయాన్ని కూడా ఉమైర్ సంధూనే ట్విట్టర్ లో వెల్లడించాడు.

Previous articleమహిళలను ఈడీ కార్యాలయంలో విచారించడాన్ని కోర్టులో సవాల్ చేసిన కవిత
Next articleసీఎం సిద్ధరామయ్యను అడ్డుకున్న ఎదురింటి వ్యక్తి…