సినిమాల్లోకి రాకముందు చాలా సార్లు నాకు డ్రగ్స్ తీసుకోమని కొంతమంది ఆఫర్ చేశారు. కానీ నేను తీసుకోలేదు. తీసుకొని ఉంటే హ్యాపీడేస్ వచ్చేది కాదు. ఆ తర్వాత కూడా అడిగారు, అప్పుడు కూడా అతీసుకొని ఉంటే కార్తికేయ 2 వచ్చేది కాదు. పేరెంట్స్ కూడా పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళని గమనించాలి. డ్రగ్స్ కి అందరూ దూరంగా ఉండాలి. నార్కోటిక్స్ కి అలవటు పడితే అదే డెత్ సెంటన్స్. సే నో టూ డ్రగ్స్. స్టూడెంట్స్ కు ఎంతో భవిష్యత్ ఉంది. పార్టిస్ కి వెళ్ళండి, ఎంజాయ్ చేయండి, కానీ డ్రగ్ తీసుకోకండి. త్వరలో డ్రగ్ ఫ్రీ తెలంగాణ అవ్వాలని కోరుకుంటున్నాను అని అన్నారు.

ఇక నటుడు ప్రియదర్శి మాట్లాడుతూ.. 10 ఏండ్ల క్రితం నేను సిగరెట్ తాగాను. దానికి బానిస కావొద్దు అనుకున్నాను. కొంత కాలం తర్వాత నాలో మార్పు వచ్చి సిగరెట్ మానేశాను. ఇప్పుడు ఎలాంటి హెల్త్ ఇష్యూష్ లేకుండా హ్యాపీగా ఉన్నాను. డ్రగ్స్ వినియోగంపై అందరికి అవగాహన రావాల్సిన అవసరం ఉంది. విద్యార్థులకు ఇలాంటి అవేర్‌నెస్ ప్రోగ్రాం నార్కోటిక్స్ విభాగం చేయడం సంతోషంగా ఉంది. విద్యార్థుల్లో కూడా పరివర్తన రావాల్సిన అవసరం ఉంది. నార్కోటిక్స్ వింగ్ పోలీసులకు నా సెల్యూట్ అని తెలిపారు.