taapsee pannu
taapsee pannu

బాలీ వుడ్ లో క్యాంపులు, ఫేవరెటిజం కొత్తేమీ కాదని, అవి ఎప్పటి నుంచో ఉన్నాయని హీరోయిన్ తాప్సీ అన్నారు. సినీ పరిశ్రమలో పక్షపాత ధోరణి ఉంటుందనే విషయం తనకు ఇండస్ట్రీకి రాకముందే తెలుసని చెప్పారు. నటీనటులు వారి స్నేహితులు కానీ లేదా వాళ్ల ఏజెన్సీలు కానీ… తమ సినిమాల్లోకి ఎవరు కావాలనుకుంటే వాళ్లనే తీసుకుంటారని తెలిపారు. వాళ్ల కెరీర్ కు సంబంధించిన విషయం కాబట్టి ఎవరినీ తప్పుపట్టలేమని అన్నారు. సినీ రంగంలో అనుకూలమైన పరిస్థితులు లేకపోయినా ఇక్కడే ఉండాలనుకుంటే అది మీ సొంత నిర్ణయమని.. ఆ తర్వాత విమర్శించడం వల్ల లాభం లేదని చెప్పారు. 

ఇటీవల అమెరికా నుంచి ఇండియాకు వచ్చిన ప్రియాంక చోప్రా మాట్లాడుతూ… బాలీవుడ్ లో కొందరు తనను కావాలనే పక్కన పెట్టేశారని, అందుకే తాను హాలీవుడ్ కు వెళ్లిపోయానని చెప్పిన సంగతి తెలిసిందే. ఇదే అంశంపై తాజాగా తాప్సీ స్పందించారు.

Previous articleOG లో ఇమ్రాన్ హష్మీ
Next articleకెప్టెన్ రోహిత్ శర్మకు చెక్