టాలీవుడ్ యంగ్ డైనమిక్ ఆది సాయికుమార్ హీరోగా, వెర్సటైల్ యాక్టర్స్ జె.డి చక్రవర్తి, సత్యరాజ్ ప్రధాన పాత్రలలో 9 స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో అభిమానుల ముందుకు వస్తున్న ‘రుధిరాక్ష’. శివ శంకర్ దేవ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని రాజు జువ్వల నిర్మిస్తున్నారు. డార్క్, థ్రిల్లర్ నేపధ్యంలో రూపొందనున్న ఈ సినిమాకి సంబధించిన పూజా కార్యక్రమం రామానాయడు స్టూడియోలో ఘనంగా జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి సముద్రఖని క్లాప్ కొట్టగా రామ్ తాళ్లూరి కెమరా స్విచాన్ చేశారు. ఫస్ట్ షాట్ కు డైరెక్టర్ దేవ్ దర్శకత్వం వహించారు. హై బడ్జెట్, టాప్ టెక్నికల్ వాల్యూస్ తెరకెక్కనున్న ఈ సినిమాకి ప్రముఖ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. ‘యానిమల్’ ఫేం హర్షవర్షన్ రామేశ్వర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. కిశోర్ బోయిదాపు డీవోపీ గా పని చేస్తున్న ఈ సినిమాకి విజయ్ కృష్ణ ఆర్ట్ డైరెక్టర్. పవన్ హిమాన్షు, బాలు మహేంద్ర మాటలు అందిస్తున్నారు.

ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభం కానుంది.

తారాగణం: ఆది సాయికుమార్, జె.డి చక్రవర్తి, సత్యరాజ్ తదితరులు

టెక్నికల్ టీం:
రచన, దర్శకత్వం: శివశంకర్ దేవ్
నిర్మాత: రాజు జువ్వల
బ్యానర్: 9 స్టార్ ఎంటర్టైన్మెంట్
మ్యూజిక్: హర్షవర్షన్ రామేశ్వర్ (యానిమల్ ఫేమ్)
డీవోపీ: కిశోర్ బోయిదాపు
ఆర్ట్ : విజయ్ కృష్ణ
మాటలు: పవన్ హిమాన్షు, బాలు మహేంద్ర
పబ్లీసిటీ డిజైనర్: మాయా బజార్
డిజిటల్: ప్రభు.ఎం
పీ.ఆర్.వో: తేజస్వి సజ్జా