నంద‌మూరి బాల‌కృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో ఇప్ప‌టివ‌ర‌కూ వ‌చ్చిన మూడు చిత్రాలు బంప‌ర్ హిట్ అయ్యాయి. అందుకే ఈ కాంబినేష‌న్ అంటే బాల‌య్య‌ అభిమానులతో పాటు సినీ ప్రియులంద‌రికీ ఎంతో ఇష్టం. వీరి కాంబోలో వచ్చిన సింహ, లెజెండ్, అఖండ.. ఒకదానికి మించి ఒకటి పెద్ద హిట్ అయిన విష‌యం తెలిసిందే. త‌ద్వారా ఈ కాంబో హ్యాట్రిక్ హిట్ కొట్టింది. దీంతో ఈ ఇద్ద‌రి క‌ల‌యిక‌లో మరో సినిమా ఉంటుందని, అదే ‘అఖండ 2’ అని గతంలోనే ప్రకటించారు.

ఇవాళ (సోమ‌వారం) బాల‌కృష్ణ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా బాలయ్య, బోయపాటి సినిమా బిగ్‌ అప్‌డేట్ వ‌చ్చింది. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌లో రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మాతలుగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వీరిద్దరి కాంబోలో నాలుగో సినిమాను మేక‌ర్స్‌ ప్రకటించారు. బీబీ4 వర్కింగ్ టైటిల్‌తో ఓ పోస్టర్ విడుద‌ల‌ చేస్తూ బాల‌కృష్ణకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియ‌జేశారు.