టీడీపీ అధినేత చంద్రబాబు జూన్ 12న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో, ఆయన కోసం కొత్త కాన్వాయ్ వాహనాలు కొనుగోలు చేశారంటూ వార్తలు వచ్చాయి. తాడేపల్లిలోని ఇంటెలిజెన్స్ ఆఫీసులో 11 వాహనాలు సిద్ధంగా ఉన్నాయని, అందులో  రెండు జామర్ వాహనాలు ఉన్నాయని, అవి 393 నెంబర్ ప్లేట్లతో ఉన్న నలుపు రంగు టయోటా వాహనాలు అని ఆ వార్తల్లో పేర్కొన్నారు. అయితే, ఈ వార్తలను తెలుగుదేశం పార్టీ ఖండించింది. ‘ముఖ్యమంత్రి చంద్రబాబు గారి కోసం కొత్త కాన్వాయ్ కొనుగోలు అంటూ సర్క్యులేట్ అవుతున్న వార్తలు పూర్తిగా అవాస్తవం’ అని స్పష్టం చేసింది.