జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫ్లయిట్ లో ఢిల్లీ నుండి విశాఖకు చేరుకున్నారు. అక్కడి నుండి అనకాపల్లి నూకాంబిక అమ్మవారి దర్శనం చేసుకున్నారు. అయితే ఎలక్షన్ కి ముందు మొక్కిన మొక్కులు తీర్చుకోవటానికి పవన్ కళ్యాణ్ నూకాంబిక ఆలయానికి వెళ్లారు. ఇది తన సొంత మొక్కుబడి అని , ఈ సందర్బంగా దైవకార్యం కోసం వెళుతున్నానని , అది పూర్తయ్యాకే అందరినీ కలుస్తానని జనసైనికులకు పవన్ సూచించారు పవన్ కళ్యాణ్ వెంట సీఎం రమేష్ కూడా ఉన్నారు. ఎటువంటి కాన్వాయ్ లేకుండా సాదా సీదాగా పవన్ కళ్యాణ్ అమ్మవారి ఆలయానికి వెళ్ళటం వెళ్లారు. ఆ తర్వాత ఆయన పిఠాపురం వెళ్లనున్నారు. పిఠాపురంలో పార్టీ నేతలతో పవన్ సమావేశం కానున్నారు. పిఠాపురంలోని పార్టీ నేతల్లో ఆధిపత్య పోరు కొనసాగుతున్న నేపథ్యంలో ఇరు పార్టీల నేతలతో పవన్ కళ్యాణ్ మాట్లాడతారని సమాచారం. అయితే గడిచిన వారంలో ఇరు పార్టీ నేతల మధ్య విబేధాలు తలెత్తినట్టు తెలుస్తోంది. అయితే ఈ ఎన్నికల్లో టీడీపీ , జనసేన నాయకులు కలసికట్టుగా పనిచేయటంతోనే కూటమి ఘన విజయం సాధించింది. అయితే టీడీపీ, జనసేన మధ్య కొద్దిగా విబేధాలు వచ్చినట్టు తెలుస్తోంది .. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ అందరు నేతలతో సమావేశం ఈ విబేధాలను అయ్యి సద్దుమణిగించి ఇరువురి మధ్య సయోధ్య కుదిర్చేందుకే పిఠాపురం వెళ్తున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల్లో ఎలాగైతే కలిసికట్టుగా ఉన్నారో ఇప్పుడు కూడా అందరూ అలాగే ఉండాలని పవన్ కళ్యాణ్ నేతలకు సూచించే అవకాశం ఉంది