Home Cinema జూన్6 న తిరుపతిలో “ఆదిపురుష్” ఈవెంట్

జూన్6 న తిరుపతిలో “ఆదిపురుష్” ఈవెంట్

ఇప్పుడు సోషల్ మీడియా సహా ఇండియన్ సినిమా దగ్గర హాట్ టాపిక్ గా ప్రతీ రోజు ట్రెండ్ అవుతున్న సినిమా పేరు “ఆదిపురుష్”. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుంచి రెండు బ్యాక్ టు బ్యాక్ పరాజయాలు వచ్చినప్పటికీ ఆదిపురుష్ సినిమాకి 1000 కోట్ల గ్రాస్ పొటెన్షియల్ అయితే నెలకొంది. ఇక ఆదిపురుష్ రిలీజ్ కి గ్యాప్ లో అయితే ఈ జూన్ 6న మేకర్స్ భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఈవెంట్ ని తిరుపతిలో చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. అయితే ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ లో అసలు తిరుపతిలో ఎక్కడ ఈ ఈవెంట్ జరుగుతుందో అభిమానులు ఎక్కడికి రావచ్చు అనేది క్లారిటీ ఇచ్చారు.

ఈ ఈవెంట్ తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ స్టేడియం లో అయితే నిర్వహిస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. జూన్6 సాయంత్రం 5 గంటల నుంచి ఈ ఈవెంట్ స్టార్ట్ అవుతున్నట్టుగా మేకర్స్ తెలిపారు