మహేశ్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా రూపొందనుందనే సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ పై విజయేంద్ర ప్రసాద్ కసరత్తు నడుస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. భారీ బడ్జెట్ తో నిర్మితం కానున్న పాన్ ఇండియా సినిమా ఇది. అయితే ఎప్పుడు ఈ ప్రాజెక్టుకి కొబ్బరికాయ కొడతారనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా ఒక విషయం హల్ చల్ చేస్తోంది. ఆగస్టు 9వ తేదీన మహేశ్ బాబు బర్త్ డే. ఆ రోజున ఈ సినిమాను లాంఛనంగా మొదలుపెట్టనున్నట్టు తెలుస్తోంది. అంటే .. ఆ రోజున పూజా కార్యక్రమాలు జరుగుతాయని చెబుతున్నారు. ఆ దిశగానే సన్నాహాలు జరుగుతున్నాయని అంటున్నారు.ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేశ్ బాబు ‘గుంటూరు కారం’ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చాలా వరకూ చిత్రీకరణ జరుపుకుంది. ఈ సినిమా కోసం మహేశ్ బాబు తన కెరియర్లోనే అత్యధిక పారితోషికాన్ని అందుకున్నట్టుగా ఒక టాక్ నడుస్తోంది. శ్రీలీల – మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమా, జనవరి 12వ తేదీన విడుదల కానుంది. 

Previous articleబీసీ కులాలను కాంగ్రెస్ నేతలు కించపరుస్తున్నారన్న తలసాని
Next articleఢిల్లీలో బిజీగా గడుపుతున్న పవన్ కల్యాణ్