సుహాస్ నుంచి ఇంతకుముందు వచ్చిన ‘కలర్ ఫోటో’ .. ‘రైటర్ పద్మభూషణ్’ సినిమాలు మంచి వసూళ్లను రాబట్టాయి. ఆ తరువాత కథానాయకుడిగా ఆయన చేసిన ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ సినిమా, ఫిబ్రవరి 2వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి.

‘గ్రేట్ ఆంధ్ర’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సుహాస్ మాట్లాడుతూ, “ఈ సినిమా కోసం నేను చాలా ఆత్రంగా వెయిట్ చేస్తున్నాను. ఆడియన్స్ తీర్పు ఎలా ఉంటుందా అనే ఒక టెన్షన్ నాకు ఉంది. సినిమా చూసిన పెద్దలంతా చాలా బాగుందనే చెప్పారు. అందువలన కొంత కాన్ఫిడెన్స్ కూడా ఉంది” అన్నాడు. 

ఈ సినిమాలో కామెడీ మాత్రమే కాదు .. బలమైన ఎమోషన్స్ ఉంటాయి. సీన్ డిమాండ్ చేయడం వల్లనే ‘గుండు’ చేయించుకోవలసి వచ్చింది. కథలో ఉన్న వేరియేషన్స్ ఆడియన్స్ కి తెలియాలనే ట్రైలర్ లో ‘గుండు’ చేయించుకునే షాట్ ను వేయడం జరిగింది. థియేటర్స్ నుంచి వచ్చే రెస్పాన్స్ కోసమే ఎదురుచూస్తున్నాను” అని చెప్పాడు.