Prabhas Salaar Movie
Prabhas Salaar Movie

దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా ‘సలార్’. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ‘కేజీఎఫ్’ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న చిత్రమిది. కేజీఎఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ తీస్తున్న మూవీ కావడం, ఇప్పటికే రిలీజైన పోస్టర్లు అదిరిపోవడంతో అంచనాలు ఆకాశాన్నంటాయి. ఈ నేపథ్యంలో సలార్.. కేజీఎఫ్ ను మించి ఉంటుందని నటి శ్రియా రెడ్డి చెప్పారు.ఓ ఇంటర్వ్యూలో ‘సలార్‌’ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ‘‘సలార్‌ సినిమా ‘కేజీఎఫ్‌’కు మించి ఉంటుంది. నేను ఇప్పటి వరకు ఇలాంటి స్క్రిప్ట్‌, యాక్షన్‌ను చూడలేదు’’ అని చెప్పారు.

ప్రశాంత్‌ నీల్‌ ‘గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌’ లాగా ఒక ప్రపంచాన్ని సృష్టించారని, ఇందులో ప్రభాస్‌ ఇప్పటి వరకు చూడని విధంగా ఉంటాడని తెలిపారు. ప్రభాస్ స్క్రీన్‌ మీద కనిపించగానే ప్రేక్షకులు కచ్చితంగా కేరింతలు కొడతారని, సినిమాలోని ప్రతి సన్నివేశం కొత్తగా ఉంటుందని అంచనాలను పెంచేశారు.