pawankalyan

ఊరు మారొచ్చు! సెంటర్‌ మారొచ్చు! కానీ, తన మాటల్లో మాత్రం పదును తగ్గదంటున్నారు పవన్‌. వారాహి యాత్ర ముందుకెళ్తున్నకొద్దీ పొలిటికల్‌ హీట్‌ పెంచేస్తున్నారు. రోజురోజుకీ డైలాగ్స్‌లో డోస్‌ పెంచుతూ మంటలు పుట్టిస్తున్నారు. ముమ్మిడివరం మీటింగ్‌లో మరోసారి ద్వారంపూడి టార్గెట్‌గా చెలరేగిపోయారు పవన్‌. రైతన్నల కన్నీటిపై ద్వారంపూడి కుటుంబం ఎదుగుతోందని విమర్శించారు. ద్వారంపూడితోపాటు జగన్‌ ప్రభుత్వంపైనా హాట్‌ అండ్‌ హీట్‌ కామెంట్స్‌ చేశారు జనసేన అధినేత. ఒక కులమో! రెండు కులాలో! మొత్తం ఆర్ధిక వ్యవస్థని చేతిలో పెట్టుకోవాలనుకుంటే కుదరదన్నారు. మిగతా కులాల్లో సమర్ధులు లేరా!, మరి ఎందుకు కీలక పదవులన్నీ రెడ్డిలకే ఇస్తున్నారంటూ ప్రశ్నించారు పవన్‌. ఇకపై కుల పెత్తనం సాగనివ్వమంటూ హెచ్చరించారు.

జగన్‌ ప్రభుత్వంపై సెటైర్లేశారు పవన్‌. ఒక ఉప్మా ప్రభుత్వం అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. వంద మంది కష్టాన్ని 30మందికి పంచిపెడుతూ మళ్లీ అధికారంలోకి వస్తానని జగన్‌ భ్రమపడుతున్నారన్నారు పవన్‌.తన దగ్గర వేలకోట్లు లేవ్‌! సుపారీ గ్యాంగ్‌లు లేవ్‌!, క్రిమినల్స్‌ కూడా లేరు! ఓడిపోతాననీ తెలుసు!. కానీ ప్రశ్నించేవాడే లేకపోతే మరింత బరితెగిస్తారు!, అందుకే తాను వైసీపీతో తలపడుతున్నా అన్నారు పవన్‌!. నేను ఓడిపోవచ్చు-కానీ మీరు నష్టపోతారు. మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని ఎవరూ కాపాడలేరంటూ ప్రజలను హెచ్చరించారు పవన్‌.

Previous article‘కేజీఎఫ్‌’ను మించిన ‘సలార్’
Next articleవైసీపీ జగన్ ది కాదు.. కేంద్ర ఎన్నికల సంఘం