ఈ రోజు తాను భావోద్వేగానికి గురయ్యానని పవన్ అన్నారు. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రాణప్రతిష్ఠ వేడుకల్లో తన కళ్ల నుంచి నీళ్ళు వచ్చినట్లు తెలిపారు. రామాలయ ప్రారంభోత్సవం దేశంలో ఐక్యతను మరింతగా పెంచిందన్నారు.

అయోధ్య రామమందిర తీర్థ ట్రస్ట్ దేశంలోని పలువురు ప్రముఖులకు ఈ కార్యక్రమం కోసం ఆహ్వానం పంపించింది. ఇందులో పవన్ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఈరోజు కార్యక్రమానికి హాజరయ్యారు.