జనసేనాని పవన్ అయోధ్య రామ మందిరంలో విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరయ్యారు. పవన్ నిన్ననే అయోధ్య చేరుకుని, రాత్రికి అక్కడే బస చేశారు. ఇవాళ శాస్త్రోక్తంగా జరిగిన బాల రాముడి దివ్య మంగళ విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో ఆయన సంప్రదాయ దుస్తులు ధరించి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయోధ్య రామ మందిరం ఎదుట పవన్ ఓ సెల్ఫీ తీసుకున్నారు. ఆ ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. రామ కార్యం అంటే రాజ్య కార్యం, ప్రజా కార్యం… జై శ్రీరామ్ అంటూ ట్వీట్ చేశారు.