అయోధ్య రామమందిరం అద్భుతం… జీవితంలో ఒక్కసారి మాత్రమే ఈ అవకాశం… ఈ మహత్తర ఘట్టాన్ని కనులారా వీక్షించడం ప్రతి ఒక్కరికీ గౌరవమని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ అన్నారు. అయోధ్య బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ వేడుకలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ… భారతదేశంలో పుట్టడం… ఈ ప్రాణప్రతిష్ఠ వేడుకను కళ్లారా చూడటం ఆనందంగా ఉందన్నారు. ఇది ఆ భగవంతుడి ఆశీర్వాదమే అన్నారు. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం రావడం పూర్వ జన్మ సుకృతమన్నారు. అయోధ్య బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో చిరంజీవి, సురేఖ, రామ్ చరణ్ తదితరులు పాల్గొన్నారు. వీరు ప్రత్యేక విమానంలో అయోధ్యకు వెళ్లారు.