ysjagan
ysjagan

వైసీపీకి జగన్ శాశ్వత అధ్యక్షుడు కాదని ఎంపీ రఘురామకృష్ణరాజుకు రాసిన లేఖలో కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌కు శాశ్వత అధ్యక్షుడిగా జగన్‌మోహన్‌రెడ్డిని ఎన్నుకున్నట్టు పత్రికల్లో వచ్చిందని, అయితే పార్టీ వైపు నుంచి ఎలాంటి ప్రకటనా లేదని, కాబట్టి ఈ విషయంలో స్పష్టత ఇవ్వాలంటూ ఈ ఏడాది ఫిబ్రవరిలో రఘురామకృష్ణరాజు ఈసీఐకి లేఖ రాశారు.

తాజాగా ఈ వివరాలు తెలియజేస్తూ రఘురామకు ఎన్నికల సంఘం లేఖ పంపింది. తమ పార్టీకి జగన్ శాశ్వత అధ్యక్షుడు కాదని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ తమకు తెలియజేసినట్టు ఆ లేఖలో పేర్కొంది. అంతేకాకుండా తమ పార్టీ పేరును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీగా కానీ, వైఎస్సార్‌సీపీగా కానీ మార్చే ప్రతిపాదన, ఆలోచన తమకు లేవని ఆ పార్టీ వివరించిందని కూడా ఈసీఐ ఆ లేఖలో స్పష్టం చేసింది.

Previous articleరోజురోజుకీ పొలిటికల్‌ హీట్‌ పెంచేస్తున్న పవన్‌
Next article కులం గురించి మాట్లాడేది మీరా? నేనా?