Srikantachari Mother
Srikantachari Mother

తెలంగాణ మలి దశ ఉద్యమంలో ప్రాణం తీసుకున్న అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని సీఎంకేసీఆర్ నిర్ణయించుకున్నారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయాల్సి ఉంది. శంకరమ్మకు ఇందులో అవకాశం కల్పించే అవకాశం ఉంది. గతంలో హుజూర్ నగర్ నుంచి అసెంబ్లీకి పోటీ చేసి శంకరమ్మ ఓడిపోయారు. ఆ తర్వాత అదే స్థానానికి ఉపఎన్నిక జరిగినప్పుడు.. టిక్కెట్ కోసం పోటీ పడ్డారు. కానీ ఆమెకు ఎమ్మెల్సీ హామీ ఇచ్చిన హైకమాండ్ సైదిరెడ్డికి చాన్స్ ఇచ్చింది. ఆయన విజయం సాదించారు.తెలంగాణ దశాబ్ది ఉత్సవాల ముగింపు రోజును.. అమర వీరులకు కేటాయించారు.ఉదయం అమరవీరుల స్థూపాల వద్ద శ్రద్ధాంజలి ఘటించి, సాయంత్రం హైదరాబాద్ లో నిర్వహించే సభలో పాల్గొంటారు. ఈ సభలోనే అమరవీరుడు అయిన శ్రీకాంతాచారి తల్లికి పదవిని ప్రకటించే అవకాశాలుఉన్నాయి.

శ్రీకాంతా చారి ఎల్పీనగర్ చౌరస్తాలో ఆత్మాహుతి చేసుకున్నారు. అందుకే ఇటీవల ఎల్బీనగర్ చౌరస్తాకు శ్రీకాంతాచారి పేరు పెడుతున్నట్లు ప్రకటించారు మంత్రి కేటీఆర్. ఈ నిర్ణయంపై శ్రీకాంత్ చారి తల్లి కూడా స్పందించింది. ‘నా కొడుకు త్యాగానికి ఇది సరైన నిర్ణయం. తెలంగాణ కోసం ఎల్బీనగర్ చౌరస్తాలో నా కొడుకు పెట్రోల్ పోసుకుని మాంసం కరగపెట్టుకున్నాడు. అయితే నిన్న కేటీఆర్ చేసిన పనికి మా కొడుకు ఆత్మా శాంతిస్తుంది. నా మనసు కూడా తృప్తి పడింది. చనిపోయిన నా కొడుకుకు మళ్ళీ ప్రాణం పోసినట్టు నాకు అనిపిస్తుంది’ అంటూ భావోద్వేగం అయ్యారు అమరుడు శ్రీకాంత్ చారి తల్లి శంకరమ్మ.

అమరులకు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వడం లేదని కొంతకాంగా ఆరోపణలు వస్తున్నాయి . వీటిని తిప్పికొట్టేందుకు శ్రీకాంతాచారి తల్లికి పదవి ఇస్తే సరిపోతుందన్న అంచనాకు వచ్చినట్లుగా తెలుస్తోంది. మరో వైపు బీఆర్ఎస్ లో చాలా మంది సీనియర్లు.. ఎమ్మెల్సీ టిక్కెట్ కోసం చూస్తున్నారు. ఒక సీటు అనూహ్యంగా శంకరమ్మకు కటాయించడంతో చాలా మంది ఆశ్చర్యానికి గురయ్యారు.