తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ఇప్పటికే మంత్రి కేటీఆర్ తలమునకలై ఉన్నారు. ఈరోజు నుంచి ఆయన బహిరంగసభలతో పాటు రోడ్ షోలను కూడా నిర్వహించనున్నారు. ఈరోజు నుంచి 28వ తేదీ వరకు తన ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ను కేటీఆర్ విడుదల చేశారు. ఈ 20 రోజుల్లో ఆయన జీహెచ్ఎంసీ పరిధిలోని 16 నియోజకవర్గాల్లో రోడ్ షోలు, మరో 14 నియోజకవర్గాల్లో రోడ్ షోలతో పాటు బహిరంగసభలను నిర్వహించనున్నారు. 10వ తేదీన ఆయన సిరిసిల్లలో నామినేషన్ వేయనున్నారు.

కేసీఆర్ రోడ్ షోలు, బహిరంగసభల షెడ్యూల్:

ఈరోజు – సంగారెడ్డి నియోజకర్గంలో రోడ్‌షో, బహిరంగ సభ
9న – ఆర్మూర్‌, కొడంగల్‌ నియోజకవర్గాల్లో రోడ్‌షో, బహిరంగ సభ
10న – సిరిసిల్లలో నామినేషన్‌ వేయనున్న కేటీఆర్
11న – జీహెచ్‌ఎంసీ పరిధిలోని పలు కాలనీలు, గేటెడ్‌ కమ్యూనిటీ, అపార్ట్‌మెంట్‌ అసోసియేషన్ల ప్రతినిధులతో సమావేశం. శామీర్‌పేటలో ఎస్టీ సెల్‌ ప్రతినిధులతో భేటీ
15న – కుత్బుల్లాపూర్‌, కూకట్‌పల్లి నియోజకవర్గాల్లో రోడ్‌షో
16న – అంబర్‌పేట, ముషీరాబాద్‌ నియోజకవర్గాల్లో రోడ్‌షో
17న – గోషామహల్‌, సికింద్రాబాద్‌ నియోజకవర్గాల్లో రోడ్‌షో
18న – జూబ్లీహిల్స్‌, ఖైరతాబాద్‌ నియోజకవర్గాల్లో రోడ్‌షో
19న – మెదక్‌, దుబ్బాక నియోజకవర్గాల్లో యువ సమ్మేళనం… సనత్‌నగర్‌, సికింద్రాబాద్‌ (కంటోన్మెంట్‌)లో రోడ్‌షో
20న – ఎల్బీనగర్ నియోజకవర్గంలో రోడ్‌షో21న – శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్‌ నియోజకవర్గాల్లో రోడ్‌షో
22న – మల్కాజ్‌గిరి, ఉప్పల్‌ నియోజకవర్గాల్లో రోడ్‌షో
23న – కోరుట్ల నియోజకవర్గంలో రోడ్‌షో, బహిరంగసభ… వేములవాడ నియోజకవర్గంలోని కథలాపూర్‌, చందుర్తి, మేడిపల్లి, రుద్రంగి మండలాల్లో రోడ్‌షో
24న – అచ్చంపేట, మక్తల్‌ నియోజకవర్గాల్లో రోడ్‌షో, బహిరంగసభ
26న – మంథని, పెద్దపల్లి, రామగుండం నియోజకవర్గాల్లో రోడ్‌షో, బహిరంగ సభ
27న – ఖానాపూర్‌, చొప్పదండి నియోజకవర్గాల్లో రోడ్‌షో, బహిరంగ సభ
28న – వేములవాడ, సిరిసిల్ల, కామారెడ్డి నియోజకవర్గాల్లో రోడ్‌షో, బహిరంగసభ.