అతని స్టైల్ వేరే లెవెల్ .. అతని యాక్షన్ మరో లెవెల్ .. బస్సు కండక్టర్ స్థాయి నుండి సూపర్ స్టార్ గా ఎదిగిన ఆ హీరోనే రజినీకాంత్. ఆయనకీ తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక రజినీకాంత్ సినిమా వచ్చిందంటే చాలు ఫాన్స్ కి పండగే. అయితే టోటల్ ఇండియన్ సినిమాలలో మంచి క్రేజ్, మార్కెట్ ఉన్న స్టార్ హీరోస్ చాలా మందే ఉన్నా రజినీ మార్క్ వేరు . ఇప్పుడిప్పుడే కాకుండా ఎప్పుడు నుంచో పాన్ ఇండియా మార్కెట్ లో ముద్ర వేసి ఇప్పటికీ సాలిడ్ సినిమా పడితే బాక్సాఫీస్ ని షేక్ చేసే వన్ అండ్ ఓన్లీ హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది సూపర్ స్టార్ రజినీకాంత్ అని చెప్పాలి. రజినీకాంత్ ఇమేజ్ గురించి ప్రతీ సినీ ప్రేమికుడికి తెలుసు. ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ఇండియన్ సినిమాల్లోని అనేకమంది స్టార్ హీరోస్ రెమ్యునరేషన్ గురించి ఎప్పుడూ ఆసక్తికర చర్చ కొనసాగుతూనే ఉంటుంది. రీసెంట్ గా కోలీవుడ్ హీరో దళపతి విజయ్ ఏకంగా 230 కోట్లు ఓ సినిమాకి తీసుకుంటున్నాడని షాకింగ్ రూమర్స్ వినిపించాయి. ఇక ఇప్పుడు రజినీకాంత్ విషయంలో షాకింగ్ ఫిగర్ బయటకి వచ్చింది. అయితే ప్రస్తుతం రజినీకాంత్ ఏకంగా 280 కోట్లు తీసుకుంటున్నారని ప్రచారం సాగుతోంది . దీంతో ఇండియా లోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న వన్ అండ్ ఓన్లీ హీరోగా రజినీకాంత్ నిలిచారు. అప్పట్లోనే రజిని కాంత్ “అన్నాత్తే” చిత్రానికి గాను 200 కోట్లకి పైగా రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు వార్తలు వినిపించాయి . ఇప్పుడు “జైలర్” తో రజినీకాంత్ సెన్సేషనల్ కం బ్యాక్ ఇచ్చారు. సో ఈ వార్తల్లో నిజం లేకపోలేదని ఇండస్ట్రీ వర్గాల్లో గుస గుసలు వినిపిస్తున్నాయి. అయితే ఏ బాలీవుడ్ హీరో కూడా రజిని దరిదాపుల్లో లేకపోవటం గమనార్హం.