అమలాపురంలో ఏర్పాటు చేసిన ప్రజాగళం-వారాహి విజయభేరి సభకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని హాజరయ్యారు. ఈ సభకు జనాలు ఇసుకేస్తే రాలనంతగా భారీగా తరలివచ్చారు. వేదిక ముందున్న కార్యకర్తలు పదే పదే జెండాలు  ఊపుతూ, ప్లకార్డులు, కటౌట్లు ప్రదర్శిస్తూ ఇబ్బంది కలిగించారు. దాంతో చంద్రబాబు, పవన్ పలుమార్లు సున్నితంగా వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. బాబూ జెండాలు ఊపొద్దు… వెనుకున్న వారికి అసౌకర్యం కలిగించొద్దు… అంటూ ఇరువురు నేతలు కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. ఇలా పలుమార్లు విజ్ఞప్తి చేయగా, ఎప్పటికో వారు జెండాలు దించారు. దాంతో వేదికపై ఉన్న నేతలు ప్రసంగం కొనసాగించారు. ఇక, ప్రసంగం మధ్యలోనూ జెండాలు మళ్లీ పైకి లేవడంతో పవన్ మరోసారి విజ్ఞప్తి చేశారు. మీ ప్రేమ నాకు అర్థమైంది… నేను మిమ్మల్ని గుర్తించాను… ఇక జెండాలు దించండి అని కోరారు.