అమలాపురం క్లాక్ టవర్ సెంటర్ వద్ద నిర్వహించిన ప్రజాగళం-వారాహి విజయభేరి సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగించారు. ఇవాళ తాము ప్రజల కోసం వచ్చామని వెల్లడించారు.  అనుభవం ఉన్న నేను… ప్రజలకు సేవ చేయాలన్న తపన ఉన్న వ్యక్తి, పవర్ స్టార్, నిజమైన నాయకుడు, మీరు నచ్చిన నాయకుడు, మీరు మెచ్చిన నాయకుడు ఇద్దరం కలిసి వచ్చామంటే ఇక చూడండి… సూపర్ డూపర్ హిట్… ఎవరైనా మాకు అడ్డంగా నిలబడగలరా? అడ్డం రావాలనుకుంటే సైకిల్ తో తొక్కుకుంటూ పోతాం… పగులగొట్టాలనుకుంటే గ్లాసు పదునెక్కుతుంది… పదునెక్కిన గ్లాసు ఏం చేస్తుందో నాకు కూడా తెలియదు… మరోవైపు కమలంతో ప్రధాని నరేంద్ర మోదీ కూడా మనతో కలిసి వస్తున్నారు అంటూ చంద్రబాబు వివరించారు.