ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో, ఏపీ బీజేపీ సంస్థాగత నియామకాలపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి దృష్టి సారించారు. ఇవాళ క్లస్టర్ ఇన్చార్జిలు, సహ ఇన్చార్జిలు, లోక్ సభ స్థానాలు సంయోజకులు, ప్రభారీలను ప్రకటించారు. తక్షణమే ఈ నియామకాలు అమల్లోకి వస్తాయని పురందేశ్వరి పేర్కొన్నారు. 25 జిల్లాలను ఐదు క్లస్టర్లు చేసి వాటికి ఇన్చార్జిలను, సహ ఇన్చార్జిలను నియమించారు. అదే సమయంలో 25 పార్లమెంటు స్థానాలకు సంయోజకులను, ప్రభారీలను నియమించారు.