చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం 89-పెద్దూరులో టీడీపీ కార్యకర్త శేషాద్రిపై దాడి జరిగింది. ఈ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. తమ కార్యకర్త శేషాద్రిపై వైసీపీ శ్రేణుల దాడిని ఖండిస్తున్నట్టు తెలిపారు. 

ఓటమి ఖాయమని తెలియడంతో విచక్షణ కోల్పోతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. అందుకే టీడీపీ కార్యకర్తలపై వైసీపీ శ్రేణులు, రౌడీలు దాడులకు పాల్పడుతున్న సంఘటనలు ఎక్కువవుతున్నాయని పేర్కొన్నారు.