టీడీపీ అధినేత చంద్రబాబు అనంతపురం జిల్లా ఉరవకొండలో ఏర్పాటు చేసిన రా కదలిరా సభలో సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. గత ప్రభుత్వంలో తాము 10 లక్షల ఎకరాలకు నీరిచ్చేలా డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థను తీసుకువస్తే, దాన్ని ఈ ముఖ్యమంత్రి పక్కనబెట్టేశాడని మండిపడ్డారు. రూ.30 కోట్ల సామగ్రిని తుప్పు పట్టించాడని ఆరోపించారు. 

“ఈ ముఖ్యమంత్రికి బుద్ది ఉందా అని అడుతున్నా… రూ.30 కోట్ల ప్రజాధనం వృథా చేసిన ఈ ముఖ్యమంత్రికి అర్హత ఉందా అని అడుగుతున్నా. ఈ ముఖ్యమంత్రి నుంచి ఇంతకంటే ఎక్కువ ఆశించలేం… ఎందుకంటే ఈయన ఉల్లిగడ్డకు, ఆలుగడ్డకు తేడా తెలియని ముఖ్యమంత్రి. ఇక వ్యవసాయం గురించి ఏం తెలుస్తుంది? టీడీపీ-జనసేన ప్రభుత్వం వచ్చాక రైతులకు మళ్లీ పాత బీమా సదుపాయం తీసుకువస్తాం. రైతులకు ఏటా రూ.20 వేలు అందిస్తాం” అని చంద్రబాబు వెల్లడించారు.