నేడు జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సోషల్ మీడియాలో స్పందించారు. మంచికి మద్దతు పలుకుతూ, రామరాజ్య స్థాపనకు మన వంతు కృషి చేయడమే జాతిపితకు మనమిచ్చే అసలైన, ఘనమైన నివాళి అని పేర్కొన్నారు. మహాత్మాగాంధీ వర్ధంతిని అమరవీరుల సంస్మరణ దినంగా పాటిస్తున్న సందర్భంగా… దేశం కోసం మహోన్నత త్యాగాలు చేసిన దేశభక్తులను స్మరించుకుందామని పిలుపునిచ్చారు. బ్రిటీష్ వారిని పారదోలేందుకు నాడు జాతిపిత అనుసరించిన బాటలోనే నేడు పోరాటం చేసి రాష్ట్రంలో విధ్వంస పాలనకు ముగింపు పలకాలి అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.