మంగళగిరి నియోజకవర్గంలో అధికార వైసీపీకి చెందిన నేతలు నేడు పెద్ద ఎత్తున టీడీపీలో చేరారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వారందరికీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఆదర్శ మంగళగిరికి అందరూ కలసిరావాలని లోకేశ్ ఇచ్చిన పిలుపునకు విశేష స్పందన లభిస్తోంది.  ఇవాళ దుగ్గిరాల మండలానికి చెందిన పలువురు వైసీపీ ముఖ్యనేతలు లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరారు. వైసీపీ సీనియర్ నేత, కాంగ్రెస్ మండలాధ్యక్షుడిగా 14 ఏళ్ల పాటు పనిచేసిన చిలువూరుకు చెందిన జడ్పీటీసీ యడ్ల వెంకట్రావు, చిలువూరు గ్రామ మాజీ సర్పంచ్, జిల్లా సర్పంచుల సంఘ మాజీ అధ్యక్షురాలు, మాజీ జడ్పీటీసీ యేళ్ల జయలక్ష్మి, పెదపాలెం సర్పంచ్, దుగ్గిరాల మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ పాటిబండ్ల కృష్ణప్రసాద్, గత 18 సంవత్సరాలుగా దుగ్గిరాల సొసైటీ చైర్మన్ గా కొనసాగుతున్న వైసీపీ నాయకుడు పాటిబండ్ల హరిప్రసాద్, పెనుమూలి సర్పంచ్ కొరిటాల పద్మావతి, మాజీసర్పంచ్, దుగ్గిరాల సొసైటీ చైర్మన్ కొరిటాల సురేశ్, తుమ్మపూడికి చెందిన వైసీపీ ముఖ్యనాయకుడు వాసిరెడ్డి లీలాప్రసాద్ నేడు లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరారు.