టీడీపీ అధినేత చంద్రబాబుపై కేశినేని నాని మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు. బాబు విజయవాడ నుంచి పోటీ చేసినా గెలవరి చెప్పారు. చంద్రబాబుపై తాను మూడు లక్షల మెజారిటీతో గెలుస్తానని ప్రకటించారు. నందిగామ వైసీపీ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఆయన ఈ మేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను పార్టీలోంచి మెడపట్టుకుని బయటకు గెంటేశారని అన్నారు. తాను ఢిల్లీ స్థాయి వ్యక్తినన్న కేశినేని నాని..ఎన్నికల్లో ఓడిపోయిన లోకేశ్ స్థాయి ఎంత అని మండిపడ్డారు.