టాలీవుడ్ స్టార్ కపుల్‌ నాగ చైతన్య – సమంత విడాకుల ఇష్యూ మరోసారి తెరపైకి వచ్చింది. అప్పట్లో వాళ్లిద్దరూ విడిపోవటం అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. వాళ్ళ విడాకులు అయినప్పటి నుండి ఈ ఇద్దరికి సంబంధించిన ఎన్నో విషయాలు జనాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. నాగ చైతన్య, సమంత తమ విడాకులకు కారణాలేంటి అనే విషయాలు వెల్లడించకుండా కేవలం డివోర్స్ విషయాన్ని మాత్రమే అధికారికంగా ప్రకటించారు. అప్పటినుంచి వేరువేరుగా ఉంటూ తమ తమ ప్రొఫెషన్స్ కంటిన్యూ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా రాష్ట్రాన్ని వణికిస్తున్న ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో నాగ చైతన్య, సమంత పేర్లు తెరపైకి వచ్చాయి. టెలిఫోన్ ట్యాపింగ్‌కి పాల్పడిన తెలంగాణ ప్రభుత్వ అధికారి ప్రణీత్ రావు అరెస్ట్, విచారణ తర్వాత సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కొందరు సినీ హీరో హీరోయిన్ల ఫోన్ కాల్స్‌పై గత ప్రభుత్వం నిఘా పెట్టిందనే విషయాలు బయటకొస్తుండటంతో సినీ వర్గాల్లో కలకలం రేపుతోంది. తాజాగా టెలిఫోన్ ట్యాపింగ్‌‌పై యూట్యూబర్ తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ నాగ చైతన్య, సమంత విడాకులకు కారణం కూడా ఇదేనంటూ సంచలన కామెంట్స్ చేయటం ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది. సమంత, నాగ చైతన్య మధ్య అప్పటి అధికార పార్టీలోని ఓ కీలక నేత, మందులు ఇచ్చే వ్యక్తి జోక్యం చేసుకోవడం వల్లే విడాకులు తీసుకొన్నారని తెలుస్తోందని.. దీనిపై నిజానిజాలు తెలుసుకొని వివరంగా మరో వీడియో చేస్తానని ఆయన చెప్పడం సంచలనంగా మారింది. నాగ చైతన్య, సమంత విడాకుల విషయాన్ని దాదాపుగా అందరూ మర్చిపోతున్న సమయంలో టెలిఫోన్ ట్యాపింగ్‌‌ ఇష్యూలో వీళ్ళ పేర్లు బయటకు వినిపించడంతో అంతా షాకవుతున్నారు. ప్రస్తుతం తీన్మార్ మల్లన్న చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.