రాష్ట్రంలో కొందరు పోలీసులు జగన్మోహన్ రెడ్డి ప్రైవేటు సైన్యంలా మారిపోయి ప్రతిపక్షాలను, ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం ఆందోళనకు గురిచేస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పేర్కొన్నారు.

రాజమండ్రి రామాలయం సెంటర్ లో  రోడ్డుపై కూర్చుని ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలియజేస్తున్న ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పీఏ చంద్రశేఖర్ పై ట్రాఫిక్ కానిస్టేబుల్ కరుణ కుమార్ విచక్షణారహితంగా దాడిచేసి తల పగులగొట్టడం దారుణం అని తెలిపారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే అధికారపార్టీ తొత్తులుగా మారి చట్టవిరుద్ధంగా ఇలా దాడులకు పాల్పడితే ప్రజలకు దిక్కెవరు? అని నారా లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు.