ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసు దేశవ్యాప్తంగా ప్రకంపనలు పుట్టించింది. అయితే ఈ కేసులో అరెస్ట్ అయిన కల్వకుంట్ల కవితకు తాజాగా సిబిఐ అరెస్ట్ చేసింది. ఇప్పటికే ఈడీ అధికారులు ఆమెను అరెస్ట్ చేయగా జ్యుడీషియల్ కస్టడీలో కొనసాగుతున్నారు తీహార్ జైలులో నుంచే ఈడీ విచారణను ఎదుర్కొంటోన్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం పాలసీలో కొన్ని గంటల పాటు విచారించిన అనంతరం కవితను అదుపులోకి తీసుకున్నారు. తీహార్ జైలులోనే ఈ విచారణ కొనసాగింది. అక్కడే ఆమెను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు . కవితను విచారించడానికి అనుమతి ఇవ్వాలంటూ కొద్దిరోజుల కిందటే సీబీఐ అధికారులు దాఖలు చేసుకున్న పిటీషన్‌పై ఢిల్లీ రోస్ అవెన్యూ న్యాయస్థానం. సానుకూలంగా స్పందించి విచారణకు అనుమతి ఇచ్చింది. ఢిల్లీ మద్యం పాలసీలో సీబీఐ అధికారులు అడిగిన పలు ప్రశ్నలకు కవిత నుంచి సరైన, సంతృప్తికర సమాధానం లభించకపోవడం వల్లే అరెస్ట్ చేశారని తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ కేసులో గత నెల 15వ తేదీన ఈడీ అధికారులు ఆమెను అరెస్ట్ చేశారు . ఢిల్లీ రోస్ అవెన్యూ న్యాయస్థానం ముందు ఆమెను హాజరుపర్చాగా జ్యుడీషియల్ కస్టడీకి తరలిస్తూ న్యాయమూర్తులు ఆదేశాలు ఇచ్చారు . మూడుసార్లు ఆమె కస్టడీని పొడిగించారు. అయితే కవితకు ఈ నెల 23 వరకు కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు సాక్ష్యాధారాలను సేకరిస్తున్నామని, ఆమె నుంచి మరింత సమాచారాన్ని రాబట్టుకోవాల్సి ఉందని న్యాయస్థానానికి ఈడీ అధికారులు వివరించారు . అయితే ఇదే కేసులో కవిత కస్టడీని కోరుతూ సీబీఐ కూడా పిటీషన్ దాఖలు చేసినట్టు ఈడీ తరఫు న్యాయవాది చెప్పారు. దీన్ని బట్టి చూస్తే ఈ కేసు తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు.