తమన్ టాలీవుడ్ లో వన్ ఆఫ్ ద లీడింగ్ మ్యూజిక్ డైరెక్టర్. ఓవైపు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. మరో వైపు తెలుగు ఇండియన్ ఐడల్ మ్యూజిక్ షోలో జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు. ఇలా షోలు, సినిమాలు చేస్తూ సంగీతాన్ని సంపాదనగా మార్చేసుకున్న బిజీ మ్యూజిక్ డైరెక్టర్.

అయితే ఇండస్ట్రీలో తమన్ కి తస్కరన్ అనే పేరు కూడా ఉంది. పాపులర్ ట్యూన్స్ ని కాపీకొట్టేస్తుంటారని ఇండస్ట్రీలోటాక్. తన మ్యూజిక్ తో ఏ పాటైనే ఒకేలా వినిపించేట్టు చేసే మ్యాజిక్ తెలిసిన మ్యూజిక్ డైరెక్టరని చెప్పుకుంటూ ఉంటారు.

లేటెస్ట్ గా ఇలాంటి కామెంట్స్ ‘గుంటూరు కారం’ మాస్ స్ట్రైక్ గురించి వినిపిస్తోంది. మహేష్‌ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘గుంటూరు కారం’ టైటిల్ రివీల్ చేస్తూ మేకర్స్ ఒక మాస్ స్ట్రైక్ వీడియోని రిలీజ్ చేశారు.

24 గంటల్లో మోస్ట్ వ్యూడ్ గ్లిమ్ప్స్ గా టాప్ ప్లేస్ లో ఉన్న పుష్ప ది రూల్ రికార్డ్స్ ని టార్గెట్ చేసిన ‘గుంటూరు కారం’ మాస్ స్ట్రైక్ ఇప్పటివరకు 20 మిలియన్స్ వ్యూస్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది కానీ తమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ దగ్గరే అసలు సమస్య వచ్చింది.

సన్న కర్ర.. సవ్వా దెబ్బ..!
బొడ్డురాయి.. బేటా దెబ్బ..!
రవ్వల దెబ్బ.. దవడ అబ్బ.. ఉయ్ !!
సరా సరా శూలం.. సుర్రంటాంది కారం!
ఎడా పెడా చూడం.. ఇది ఎర్రెక్కించే బేరం!
సరా సరా శూలం.. సుర్రంటాంది కారం!
ఇనుప సువ్వ.. కౌకు దెబ్బ.. ఇరగదీసే రవ్వల దెబ్బ.. ఉయ్ !!

అంటూ తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో కొట్టిన సాంగ్ కాపీ అనే కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. తమన్ మళ్లీ దొరికిపోయాడు అనే విమర్శలు మొదలయ్యాయి. తమన్ నుంచి సాంగ్ బయటకి రాగానే అది కాపీ అనడానికి ఒక వర్గం రెడీగా ఉంటుంది.

ఇప్పుడు కూడా అలానే గుంటూరు కారం ట్యూన్, విజయ్ సేతుపతి ‘కాతువాకుల రెండు కాదల్’ సినిమాలో.. అనిరుధ్ ఇచ్చిన ‘డిప్ప డిప్పమ్’ ట్యూన్‌లా ఉందని అంటున్నారు. ఇక మాస్ స్ట్రైక్‌ స్టార్టింగ్‌లో వచ్చే మాస్ బీట్..దేవిశ్రీ ప్రసాద్ ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలో ‘లవ్ దెబ్బ’ సాంగ్‌ బీట్‌లా ఉందంటూ వైరల్ చేస్తున్నారు.

ప్రస్తుతం ఈ వీడియోలని పక్కపక్కన పెట్టి.. తమన్ మళ్లీ కాపీ కొట్టేశాడు అంటూ ట్రోల్ తెగ చేస్తున్నారు.అయితే తమన్ పై కాపీ క్యాట్ ట్రోల్స్ రావడం కొత్త కాదు. అతని ట్యూన్స్ ని కాపీ అంటూ ఉంటారు, అతని సాంగ్స్ ని చార్ట్ బస్టర్స్ చేస్తూ ఉంటారు. ఇది ఎప్పుడూ జరిగేదే కాబట్టి తమన్ పై వచ్చే కామెంట్స్ ని పక్కన పెట్టి గుంటూరు కారం మాస్ స్ట్రైక్ చూసి ఎంజాయ్ చేయండి.