ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు ఇంట విషాదం నెలకొంది. దిల్ రాజు తండ్రి శ్యాం సుందర్ రెడ్డి (86) కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న ఆయన నిన్న రాత్రి తుదిశ్వాస విడిచారు. ఈరోజు ఆయన అంత్యక్రియలను నిర్వహించారు. దిల్ రాజు ఇంటికి వెళ్లిన చిరంజీవి… శ్యాం సుందర్ రెడ్డికి నివాళి అర్పించారు. మరోవైపు దిల్ రాజు తండ్రి అంత్యక్రియల్లో ప్రకాశ్ రాజ్ స్వయంగా పాల్గొన్నారు. దిల్ రాజుకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా తన బాధను ఆపుకోలేక పోయిన దిల్ రాజు… ప్రకాశ్ రాజ్ ను పట్టుకుని భోరుమని ఏడ్చారు.