ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో మాజీ మంత్రి నారా లోకేశ్ ను సీఐడీ నేడు సుదీర్ఘంగా ప్రశ్నించింది. ఈ ఉదయం లోకేశ్ తాడేపల్లి సిట్ కార్యాలయానికి విచ్చేశారు. ఉదయం 10 గంటల తర్వాత విచారణ మొదలవగా, సాయంత్రానికి విచారణ ముగిసింది.  వాస్తవానికి అక్టోబరు 4నే విచారణకు హాజరు కావాలని సీఐడీ లోకేశ్ కు నోటీసులు పంపింది. అయితే, హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో లోకేశ్ ను ఇవాళ (అక్టోబరు 10) విచారించారు. లోకేశ్ ను 50 ప్రశ్నలు అడిగారు. కాగా, మరింత సమాచారం కోసం రేపు మరోసారి విచారణకు రావాలని నారా లోకేశ్ కు 41ఏ నోటీసులు ఇచ్చారు. తాను రేపు కూడా విచారణకు హాజరవుతానని లోకేశ్ తెలిపారు.

Previous articleపవన్ కల్యాణ్ కు వైరల్ ఫీవర్
Next articleదిల్ రాజు తండ్రి కన్నుమూత…