Pawankalyan Varahi

వారాహి, వారాహిలో వచ్చే పవన్ కోసం అభిమానులు, జనసేనులు, జనసేన వీరనారీలు వేయికళ్లతో ఎదుచూస్తున్నారు. పవన్ కల్యాణ్ వారాహి వాహనంతో ప్రచారం చేయడంపై నేడు జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మంగళగిరి జనసేన కార్యాలయంలో గోదావరి జిల్లాల నేతలతో సమావేశమయ్యారు. త్వరలో ప్రారంభం కానున్న పవన్ కల్యాణ్ వారాహి యాత్రపై ఈ సమావేశంలో చర్చించారు.


జూన్ 14వ తేదీ నుంచి వారాహిపై పవన్ ప్రచార యాత్ర ప్రారంభం అవుతుందని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. తొలుత ఉభయ గోదావరి జిల్లాల్లో యాత్ర జరగనుంది. ఈ మేరకు షెడ్యూల్ ఖరారు చేసినట్లు తెలిపారు. ప్రజల సమస్యలను ప్రస్తావించేలా పవన్ యాత్ర జరుగుతుందన్నారు. అన్నవరం నుంచి వారాహి యాత్ర ఆరంభమవుతుంది. యాత్రలో ప్రతిరోజూ ఓ ఫీల్డ్ విజిట్ ఉంటుందని తెలిపారు. ఒక్కో నియోజకవర్గంలో రెండ్రోజులు యాత్ర నిర్వహించేలా షెడ్యూల్ సిద్ధం చేశామన్నారు. త్వరలోనే వారాహి యాత్ర ప్రారంభం కానుండటంతో జనసైనికుల్లో కొత్త ఉత్సాహం వచ్చింది.