ram charan

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లవుతోంది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో, టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ స్పందించారు. తెలంగాణ రాష్ట్రం రూపుదాల్చి పదేళ్లు అవుతోందని, ఈ పదేళ్లలో ఎంతో పురోగతి సాధ్యమైందని తెలిపారు. అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి బంగారు తెలంగాణ కల నిజం చేసుకుంటున్నామని రామ్ చరణ్ పేర్కొన్నారు. దశాబ్ది వేడుకల సందర్భంగా తెలంగాణ సోదర సోదరీమణులందరికీ శుభాకాంక్షలు చెబుతున్నానని వెల్లడించారు.