వికారాబాద్ జిల్లా దోమ మండలం బ్రాహ్మణపల్లిలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఆలయ ప్రవేశం విషయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. దీంతో కొందరు యువకులు పోలీసు వాహనంపై దాడి చేసిన అద్దాలు పగలగొట్టారు.

రెండు రోజుల క్రితం పౌరహక్కుల దినోత్సవం సందర్భంగా దోమ ఎస్సై విశ్వజన్ గ్రామంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే గుడి ప్రవేశం చేసిన వారితో కొందరు గ్రామస్తులు గొడవకు దిగారు.
అయితే జూన్ 1వ తేదీ సాయంత్రం గ్రామానికి వెళ్ళిన ఎస్సై..గ్రామస్థులను సముదాయించే ప్రయత్నం చేశారు. కోపోద్రిక్తులైన గ్రామస్థులు పోలీసు వాహనాన్ని ధ్వంసం చేశారు.
దీంతో గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. బ్రాహ్మణపల్లిలో పరిస్థితి అదుపుతప్పడంతో అక్కడకు పోలీసులు భారీగా చేరుకుంటున్నారు. అయితే ఎస్సై అత్యుత్సాహం వల్లే గొడవ జరిగినట్టుగా సమాచారం.