rythu bandhu
rythu bandhu

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలు జరుగుతున్న వేళ రాష్ట్రంలోని రైతులకు భారీ గుడ్ న్యూస్ చెప్పేందుకు సీఎం కేసీఆర్ సర్కార్ సిద్ధమవుతోంది. టీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన పథకాల్లో రైతు బంధు ఒకటి. గత ఎన్నికల్లో కారు గుర్తుపై ఓట్ల వర్షం కురిపించిన పథకాల్లో ఇది ఒకటన్న అభిప్రాయం కూడా ఉంది.
ఈ నేపథ్యంలో రైతులకు గతంలో కంటే మరింత ముందుగానే ఈ వర్షాకాలం సీజన్ కు సంబంధించిన రైతు బంధు పెట్టుబడి సాయన్ని అందించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.నిధుల విడుదలపై అంశంపై సీఎం కేసీఆర్ రెండు రోజుల్లోగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

Previous articleపవన్ కి హ్యాండిచ్చిన రకుల్..సెట్ లోకి ఊర్వశి రౌతేలా
Next articleElectric Car: ఎలక్ట్రిక్ కారు కొంటే రూ.2.5 లక్షల తగ్గింపు..