పవన్ కళ్యాణ్ సాయి ధరంతేజ్ ప్రధాన పాత్రలలో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. తమిళంలో విడుదల సూపర్ హిట్ గా నిలిచిన వినోదయ చిత్తం అనే సినిమాని తెలుగులో బ్రో పేరుతో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త తెర మీదకు వచ్చింది. వాస్తవానికి తమిళ సినిమాలో ఇలాంటి ఐటెం సాంగ్స్ ఏమీ లేవు కానీ తెలుగు సినిమా అంటే తెలుగు ఆడియన్స్ కి కావాల్సిన విధంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో త్రివిక్రమ్ మార్క్ ఇందులో చూపిస్తున్నారు.
ఈ సినిమాకి త్రివిక్రమ్ డైలాగ్స్ అందిస్తూ ఉండడంతో పాటు స్క్రీన్ ప్లే కూడా చూసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో ఐటెం సాంగ్ ఉంటే బాగుంటుందని భావించి ఐటమ్ సాంగ్ చేసేందుకు గాను రకుల్ ప్రీత్ సింగ్ తో సంప్రదింపులు జరిపారు. దానికి ఆమె ఒప్పుకుంది కూడా. రేపటి నుంచి ఈ సినిమా ఐటెం సాంగ్ షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా శుక్రవారం నాడు తాను సోమవారం నుంచి షూట్లో పాల్గొనలేనని ఇతర సినిమాలను మేనేజ్ చేసుకోలేక డేట్స్ క్లాష్ అవుతూ ఉండడం వల్ల రాలేకపోతున్నానని చెప్పింది. ఇక అప్పటికప్పుడు సినిమా యూనిట్ వెంటనే ఊర్వశి రౌతేలాను బుక్ చేసుకున్నట్లు తెలుస్తోంది.నిజానికి ఊర్వశి రౌతేలా ఇప్పటికే రెండు తెలుగు సాంగ్స్ లో నటించి మంచి పేరు తెచ్చుకుంది.ఈ సినిమాలో ఇప్పుడు ఊర్వశి రౌతేలా ఐటమ్ సాంగ్ అనగానే అందరి దృష్టి పడుతోంది.ఇది ఆమెకు తెలుగు లో మూడవ సాంగ్ గా నిలవనుంది.