కొత్తగా కారు కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అది కూడా పెట్రోల్, డీజిల్ కారు కాకుండా ఎలక్ట్రిక్ కారు కోసం చూస్తున్నారా? అయితే మీకు శుభవార్త. ఎందుకంటే ఎలక్ట్రిక్ వెహికల్స్‌పై అదిరే తగ్గింపు పొందొచ్చు.ఎలక్ట్రిక్ కార్లపై ఏకంగా రూ. 2.5 లక్షల వరకు సబ్సిడీ పొందొచ్చు. అయితే ఈ సబ్సిడీ మొత్తం అనేది రాష్ట్రం ప్రాతిపదికన మారుతుంది. అంటే ఒక్కో రాష్ట్రంలో సబ్సిడీ ఒక్కోలా ఉంటుంది. కొన్ని రాష్ట్రాల్లో అసలు సబ్సిడీ ఉండకపోవచ్చు.ఫేమ్ 2 సబ్సిడీ కాకుండా రాష్ట్రాలు అందిస్తున్న ఈవీ సబ్సిడీ తెలుసుకుందాం. మహరాష్ట్రలో కారు కొంటే సబ్సిడీ గరిష్టంగా రూ. 2.5 లక్షల వరకు వస్తుంది. రోడ్ ట్యాక్స్‌లో 100 శాతం తగ్గింపు పొందొచ్చు. అలాగే గుజరాత్‌లో అయితే రూ. 1.5 లక్షల వరకు సబ్సిడీ వస్తుంది. 50 శాతం రోడ్ ట్యాక్స్ తగ్గింపు లభిస్తుంది.ఇకపోతే తెలుగు రాష్ట్రాల్ల ఎలక్ట్రిక్ కార్లపై సబ్సిడీ లభించడం లేదు. ఏపీ, టీఎస్‌తో పాటుగా పంజాబ్, మధ్రప్రదేశ్, తమిళనాడు , కర్నాటక, కేరళలో ఎలాంటి సబ్సిడీ లేదు. అయితే రోడ్ ట్యాక్స్‌లో మాత్రం తగ్గింపు అందుబాటులో ఉందని చెప్పుకోవచ్చు.