ఆ మధ్య వరుస ఫ్లాపులు ఉక్కిరి బిక్కిరి చేయడంతో, శర్వానంద్ కొంత గ్యాప్ తీసుకున్నాడు. ఆ తరువాత ఆయన శ్రీరామ్ ఆదిత్యకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి, ఆయన దర్శకత్వంలో ‘బాబ్’ అనే ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తవుతుండగానే శర్వానంద్ మరో ప్రాజెక్టును సెట్ చేసుకున్నట్టుగా ఒక టాక్ బలంగా వినిపిస్తోంది. 

శర్వానంద్ కి కథ వినిపించి ఓకే చేసుకున్న ఆ దర్శకుడు రామ్ అబ్బరాజు. క్రితం ఏడాది ఆయన నుంచి ‘సామజవరగమన’ సినిమా వచ్చింది. శ్రీవిష్ణు – రెబా మోనికా జాన్ జంటగా నటించిన ఈ సినిమా, ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. మంచి వినోదభరితమైన చిత్రంగా ప్రశంసలను అందుకుంది.  ఆ తరువాత ఆయన రెడీ చేసుకున్న కథ ఇదే.