మిడిల్ క్లాస్ నుండి వచ్చి ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ గా ఎదిగారు చిరంజీవి. ఆయన సినీ కెరీయర్, వ్యక్తిగత జీవితం గురించి ఎప్పటికప్పుడు అభిమానులతో ,మీడియాతో షేర్ చేసుకుంటూ ఉంటారు. ఆయన ఫ్యామిలీతో పాటు అన్ని విషయాలు ఫ్యాన్స్ కి తెలిసిందే. ఆయన ఉదయం నుంచి రాత్రి వరకు ఏం చేస్తారు, ఆయన ప్రాముఖ్యతలు ఏంటి, ఆయన ఎక్కువ సమయం ఎక్కడ స్పెండ్‌ చేస్తాడు అనే విషయాలు మెగాస్టార్ ఫ్యాన్స్ పేజీలో అప్డేట్ వస్తూనే ఉంటుంది . కానీ ఇంతవరకు ఈ విషయం ఎవరికీ తెలియదు .. ఆ విషయాన్ని తాజాగా మహానటి సావిత్రికి సంబంధించిన కార్యక్రమంలో మహానటి సావిత్రి కూతురు.చిరంజీవి గురించి షాకింగ్ నిజం చెప్పింది. సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరి మాట్లాడుతూ… చిరంజీవి నిద్ర లేవగానే సావిత్రమ్మ ఫొటోను చూస్తారని చెప్పింది . తాను ఫస్ట్ టైం చిరు ఇంటికి వెళ్ళినప్పుడే తనకు ఈ విషయం తెలిసిందని , అమ్మ అంటే చిరంజీవికి ఎంత అభిమానమో తనకు అప్పుడే అర్థం అయ్యిందని ఆమె తెలిపింది. చిరంజీవి విశ్వంభర సినిమా షూటింగ్‌ తో ఎంతో బిజీగా ఉన్నా కూడా సావిత్రమ్మ పై ఆయనకు ఉన్న అభిమానంతో షూటింగ్‌ కు బ్రేక్ ఇచ్చి మరీ కార్యక్రమంలో హాజరు అయ్యారు. సావిత్రి కి సంబంధించిన ఏ చిన్న ప్రోగ్రాం జరిగినా చిరంజీవి హాజరవ్వటం మనందరికీ తెలిసిందే . దీన్ని బట్టి సావిత్రి గారంటే చిరంజీవికి ఎంతటి అభిమానం ఉందో అర్థం అవుతుంది . సాధారణంగా నిద్ర లేచిన వెంటనే ఎవరైనా దేవుడి ఫోటోను చూస్తారు. కానీ చిరంజీవి గారు మాత్రం సావిత్రి గారి ఫోటోను చేస్తారంటే ఆమెపట్ల ఆయన అభిమానం వెలలేనిదనే చెప్పాలి.