ఎన్నికల వేళ ఆయా రాజకీయ పార్టీల నాయకులు ఒకరి పై ఒకరు దుష్ప్రచారం చేసుకుంటూ ఉంటారు.. విమర్శలు గుప్పిస్తూ ఉంటారు. అయితే తాజాగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ని ఆ పార్టీ నేతలు విచిత్రంగా విమర్శించారు. వివరాల్లోకి వెళ్తే తమిళనాడుపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రధాని మోదీ తాజాగా ఆ రాష్ట్ర రాజకీయాలపై, అక్కడి పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. ఇటీవల ఆ రాష్ట్రంలో పలుమార్లు తన పర్యటనలో భాగంగా మోదీ స్థానిక డీఎంకే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు డీఎంకే నేతలు కూడా తిరిగి కౌంటర్ ఇస్తున్నారు. తాజాగా ఓ డీఎంకే నేత మోదీ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలిచి.. మరోసారి నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయితే దేశంలో చికెన్, మటన్ తినడంపై నిషేధం విధిస్తారని పేర్కొన్నారు.. అప్పుడు పెరుగన్నం, సాంబార్ అన్నమే దిక్కు అవుతుందని పేర్కొన్నారు. తమిళనాడులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా డీఎంకే నేత చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వస్తే మనం తినే ఆహారంపై కఠినమైన ఆంక్షలు విధిస్తారని పేర్కొన్నారు. అయితే రాజకీయ నాయకులు ఒకరి పై ఒకరు దుష్ప్రచారం చేసుకోవటం సహజమే కానీ మరీ ఇలా విమర్శించుకోవడం ఏంటని నెటిజన్లు అంటున్నారు.