పవన్ కళ్యాణ్ .. సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా ఆయనొక సంచలనం .. సినిమాలు చేస్తూ ఆయన కోట్లు సంపాదించొచ్చు .. కానీ ఆయన డబ్బు కంటే ప్రజాసేవకే ఎక్కువ విలువిచ్చారు.. ఐశ్వర్యంలో ఉండే ఆనందం కంటే పేదవాళ్లకు చేసే సేవలోనే నిజమైన సంతోషం వెతుక్కుంరున్నారు.. ఆయనకున్న ఇమేజ్ కి , డబ్బుకి అడుగు కింద పెట్టి నడవాల్సిన అవసరం లేదు.. ఆటోలో ఎక్కాల్సిన అవసరం అసలే లేదు. ఒక పేదింటికి వెళ్లి నులక మంచంపై కూర్చుని వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం అంతకన్నా లేదు… కానీ ఆస్తుల్ని , ఐశ్వర్యాన్ని , కుటుంబాన్ని పక్కన పెట్టి పేదవాళ్లకు సేవ చేయటం కోసం పయనమయ్యాడు. రాజకీయనాయకుడిగా నిజమైన రాజకీయం అంటే ఏంటో చూపిస్తానని కంకణం కట్టుకున్నాడు.. ఆయన నమ్మిన సిద్ధాంతం కోసం అన్నీ వదిలి నిరాడంబరంగా ప్రజాసేవకు అంకితం కావాలనుకున్నాడు.. ఆయన ఆలోచనలోంచి పుట్టిందే జనసేన పార్టీ.. ఈ సారి ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ అక్కడ ప్రచారం చేస్తున్నారు .. ఈ క్రమంలో రోడ్డుషోలో జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆటో ఎక్కారు. కొండెవ‌రం వ‌ద్ద ఆటో ఎక్కిన పవన్ కళ్యాణ్ దాదాపు రెండు కిలోమీట‌ర్ల మేర‌ ప్ర‌యాణించారు. ఈ సంద‌ర్భంగా ఆయన మాట్లాడుతూ ‘నేను మీ ప‌వ‌న్ క‌ల్యాణ్‌. పిఠాపురం అసెంబ్లీ నుంచి పోటీ చేస్తున్నాను. మీరంద‌రూ ఓటేసి న‌న్ను గెలిపించండి’ అని ఓట‌ర్ల‌ను కోరారు. ఇక ఆటోలో ప్ర‌యాణిస్తున్న స‌మ‌యంలో అక్కడి రోడ్ల‌పై డ్రైవ‌ర్లు ఎదుర్కొంటున్న ఇక్క‌ట్ల విష‌య‌మై ఆటో డ్రైవ‌ర్ వ‌ద్ద‌ ఆరా తీశారు. ప్ర‌తి ఒక్క‌రి స‌మ‌స్యను తెలుసుకుంటాన‌ని, మీలో ఒక‌డిగా ఉంటూ కూట‌మి ప్రభుత్వం వ‌చ్చాక స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తాన‌ని జనసేన అధినేత ప‌వ‌న్ కళ్యాణ్ వారికి భ‌రోసా ఇచ్చారు.