శ్రీ పవన్ కళ్యాణ్ పై శ్రీమతి వాసిరెడ్డి పద్మ అనుచిత వ్యాఖ్యలకు నిరసన
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిపై ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఛైర్మన్ శ్రీమతి వాసిరెడ్డి పద్మ చేసిన అనుచిత వ్యాఖ్యలపై పార్టీ వీర మహిళలు నిరసన చేపట్టారు. రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయాన్ని ముట్టడించారు. వాసిరెడ్డి పద్మ విసిరిన సవాలును స్వీకరించిన గుంటూరు జిల్లా వీర మహిళలు చర్చకు రావాలని డిమాండ్ చేస్తూ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. వాసిరెడ్డి పద్మతో చర్చకు అయినా సిద్ధం, చంపలు పగులగొట్టుకోవడానికైనా సిద్ధం అంటూ నినాదాలు చేశారు. అప్పటికే మహిళా కమిషన్ కార్యాలయం వద్ద పెద్ద సంఖ్యలో మోహరించిన పోలీసులు వీర మహిళలను అరెస్టు చేశారు. పోలీసు వాహనాల్లో గంటల తరబడి రోడ్లు తిప్పుతూ.. 25 మందిని నల్లపాడు పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఆరుగురిని తాడికొండ పోలీస్ స్టేషన్ లో ఉంచారు. మరో 40 మందిని తెనాలి వైపు తీసుకువెళ్లారు. నిరసన కార్యక్రమంలో పార్టీ ప్రాంతీయ వీర మహిళా విభాగం సభ్యులు శ్రీమతి బొని పార్వతినాయుడు, శ్రీమతి రావి సౌజన్య, గుంటూరు జిల్లా కమిటీ సభ్యులు శ్రీమతి బిట్రగుంట మల్లిక, శ్రీమతి బడే కోమలి, శ్రీమతి తులసి కుమారి తదితరులు పాల్గొన్నారు.

Previous article1-8-2023TODAY E-PAPER
Next articleఎన్నికల హామీలు నెరవేర్చలేదని చెప్పుతో కొట్టుకున్న నర్సీపట్నం కౌన్సిలర్…