టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున, ఆషికా రంగనాథ్ జంటగా నటిస్తున్న చిత్రం ‘నా సామిరంగ’. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

కాగా, ‘నా సామిరంగ’ చిత్రం నుంచి తొలి సింగిల్ రిలీజైంది. ‘ఎత్తుకెళ్లి పోవాలనిపిస్తుందే…’ అంటూ పల్లెటూరి పదజాలంతో సాగే ఈ పాట మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునేలా ఉంది. ఆస్కార్ విన్నింగ్ జోడీ ఎంఎం కీరవాణి, చంద్రబోస్ ఈ పాట కోసం మళ్లీ కలిశారు. కీరవాణి బాణీలకు చంద్రబోస్ సాహిత్యం సమకూర్చారు. ఈ గీతాన్ని రామ్ మిరియాల ఆలపించారు.