స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నటించిన చిత్రం “డీజే టిల్లు” చిత్రం టాలీవుడ్ యూత్ ఫుల్ క్రేజీ హిట్ చిత్రాల్లో ఒకటిగా నిలిచిందనే చెప్పాలి . మరి ఈ చిత్రానికి క్రేజీ సీక్వెల్గా వచ్చిన చిత్రమే “టిల్లు స్క్వేర్”. దర్శకుడు మల్లిక్ రామ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమా అంచనాలు అందుకుందో లేదో సమీక్షలో చూద్దాం.. ఇక కథ విషయానికివస్తే వస్తే పాత దెబ్బ నుంచి కోలుకుని టిల్లు తన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో కలిసి టిల్లు ఈవెంట్స్ స్టార్ట్ చేసి వెడ్డింగ్ ప్లానింగ్ లు తన డీజే ఈవెంట్స్ చేస్తుంటాడు. అలా ఓ రోజు తన లైఫ్ లోకి లిల్లీ జోసెఫ్ అనుపమ పరమేశ్వరన్ క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. ఇక అక్కడ నుంచి మళ్లీ టిల్లు గేర్ మారుస్తాడు. ఈ చిత్రంలో కూడా లిల్లీ తనని సాయం కోరుతుంది. మరి రాధికా వల్ల దెబ్బ తిన్న సిద్దు లిల్లీ చెప్పిన ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తాడా లేదా ..? వీళ్ళ కథలోకి పేరు మోసిన మాఫియా డాన్ మెహబూబ్ అలీ కి లింక్ ఏంటి? మళ్లీ రాధికా ఉందా లేదా..? అసలు చివరికి ఈ క్రేజీ రైడ్ ఎలా ఎండ్ అయ్యింది అనేది తెలియాలి అంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే. డీజే టిల్లు సూపర్ హిట్ అవటంతో దీనిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయనే చెప్పాలి . మెయిన్ గా ఎంటర్టైనింగ్ పరంగా టిల్లు స్క్వేర్ వాటిని అందుకుంటుంది అని చెప్పవచ్చు. సినిమా టైటిల్ కార్డ్స్ నుంచే మళ్లీ టిల్లు వైబ్స్ ని గుర్తు చేస్తూ సాలిడ్ ఎంటర్టైన్మెంట్ తో సినిమా సాగుతుంది. సిద్ధూ జొన్నలగడ్డ మరోసారి తన మార్క్ కామెడీతో బాగా ఆకట్టుకున్నాడు. కొన్ని సీన్స్ లో మంచి హ్యాండ్సమ్ లుక్స్ తో మంచి నటనతో తాను ఆకట్టుకుంటాడు . ఇక అనుపమ కూడా తన పాత్రను బాగా చేసింది. తన గ్లామర్ షో ఒకెత్తు అయితే తన పెర్ఫామెన్స్ తో కూడా సినిమాలో అదరగొడుతుంది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ తో పాటు కామెడీ సీన్స్ తో యూత్ కి ఈ సినిమాలో మంచి ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది. సెకండాఫ్ లో ఓ సర్ప్రైజ్ సీన్ బాగా ఆకట్టుకుంటుంది . ఇంకా మెయిన్ లీడ్ సహా మురళీ శర్మ తన రోల్ కి న్యాయం చేకూర్చారు. మరో నటుడు మురళీధర్ గౌడ్ నటన ఆయన కామెడీ టైమింగ్ ఆకట్టుకుంటాయి. ఇక వీరితో పాటుగా మిగతా తారాగణం అంతా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేసారు. ఈ చిత్రంలో డెఫినెట్ గా మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది కానీ కాన్సెప్ట్ మాత్రం రొటీన్ గానే ఉందని చెప్పాలి. అలాగే కొన్ని సీన్స్ ఊహాజనీతం గానే అనిపిస్తాయి. ఇంకా కొన్ని కీలక ట్విస్ట్ లు మరీ అంత ఎగ్జైట్ చెయ్యవు.అలాగే క్లైమాక్స్ పోర్షన్ కూడా ఒకింత రొటీన్ గానే అనిపిస్తుంది. ఇవి పక్కన పెడితే ఒక టైం లో అనుపమ రోల్ పై ట్విస్ట్ అందరికీ రుచించకపోవచ్చు. అలాగే సెకండాఫ్ లో మురళీ శర్మ పై కొన్ని ఎపిసోడ్స్ లో లాజిక్స్ సహా కొన్ని అంశాలు వీక్ గా అనిపిస్తాయి. ఈ సినిమాలో నిర్మాణ విలువలు బాగున్నాయి. మేకర్స్ అయితే ఎక్కడా కాంప్రమైజ్ అయినట్టు అనిపించదు. అలాగే టెక్నికల్ టీం లో రామ్ మిర్యాల, అచ్చు సాంగ్స్ , భీమ్స్ నేపథ్య సంగీతం బాగా ప్లస్ అయ్యాయి. అలాగే సాయి ప్రకాష్ సినిమాటోగ్రఫీ మంచి కలర్ ఫుల్ గా బ్యూటిఫుల్ విజువల్స్ తో ఆకట్టుకునేలా ఉంది. నవీన్ నూలి ఎడిటింగ్ కూడా బాగుంది. ఇక దర్శకుడిగా మల్లిక్ రామ్ మార్కులు కొట్టేసాడనే చెప్పాలి . తనతో పాటుగా సిద్ధూ కూడా ఈ చిత్రానికి రచనలో తన పనితనం చూపించాడు. ఇక మొత్తంగా చూసినట్టయితే డీజే టిల్లు కి సీక్వెల్ గా వచ్చిన ఈ క్రేజీ రైడ్ “టిల్లు స్క్వేర్” ఎంటర్టైన్మెంట్ ఇవ్వడంలో మాత్రం డిజప్పాయింట్ చెయ్యదనే చెప్పాలి.